తెలంగాణ రైతుల‌కు కేసీఆర్ శుభ‌వార్త‌..అంద‌రికీ రైతు బంధు ఇవ్వాల‌ని ఆదేశాలు

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. మరి వేసే రైతులకు రైతుబంధు ఆపేయాలన్న వ్యవసాయ శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పక్కన పెట్టారు. ఇవాళ పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులందరికీ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుబంధు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

KCR-TRS
KCR-TRS

అటు ఇదే సమయంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసిన రైతులు చైతన్యాన్ని తేవాలని కెసిఆర్ సూచనలు చేశారు. దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై ఈనెల 20వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే లు జనాల్లో వుండాలి.. ప్రభుత్వ పథకాలు వివరించండని ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు జారీ చేశారు. మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరన్నారు కేసీఆర్‌. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండి.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండ‌న్నారు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి మనం ధాన్యం కొనటం లేదని రైతులోకి తీసుకెళ్లండని పిలుపునిచ్చారు.