సీసీఐఎల్‌లో ఉద్యోగాలు..ఇంట‌ర్వ్యూ ద్వారానే ఎంపిక‌

ఇప్పుడు ఉద్యోగం అనేది ఎంత ఇంపార్టెంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క‌రోనా వ‌చ్చాక చాలామంది ఉపాధి కోల్పాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసం ఓ గుడ‌న్యూస్‌. ఇప్పుడు సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్‌) లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ‌లో మొత్తం 46 ఖాళీలు ఉన్నాయి.

ఈ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, మైనింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్ ఉద్యోగాల‌ను ముందుగా భ‌ర్తీ చేస్తారు. ఇక వీటితో పాటు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, హ్యూమ‌న్ రిసోర్స్‌, కంపెనీ సెక్రెట‌రీ, రాజ్‌భాష అధికారి, లీగ‌ల్ ఉద్యోగాల కోసం అభ్యర్థుల‌ను తీసుకుంటారు.

ఇక ఈ పోస్టుల‌కు అప్లై చేయాల‌నుకున్న వారు ఇంజినీరింగ్‌, డిప్లొమా, డిగ్రీలో పాస్ అయి ఉండాలి. సంబంధిత పనిలో నిర్ధిష్ట‌మైన అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు దాట‌కూడ‌దు. అప్లై చేసుకున్న వారికి ఎలాంటి ఎగ్జామ్ ఉండ‌దు. కేవ‌లం ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఎంపికైన వారంతా తాండూర్‌, బొక‌జాన్‌, రాజ్‌బ‌న్‌, కార్పొరేట్ ఆఫీస్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ ఈ నెల 30.