మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 39 నాన్ టీచింగ్ పోస్టులు వున్నాయి.
అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్స్, లైబ్రరీ, సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కంప్యూటర్ సెంటర్ నెట్వర్క్ మొదలైన వాటిలో ఈ ఖాళీలు వున్నాయి. ఇక అర్హత వివరాలను చూస్తే.. కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అదే విధంగా అనుభవం తప్పని సరి.
ఇక వయస్సు వివరాలను చూస్తే.. 27 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వారు నవంబర్ 10, 2022వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంది. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది చూసుకోండి. పోస్టులను బట్టి సెలెక్షన్ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోవచ్చు.