సౌత్ ఇండియన్ బ్యాంక్ లో ఖాళీలు.. వివరాలివే..!

మీరు ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాస్ కావడంతో పాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి. వీటికి అప్లై చెయ్యడానికి 2021 సెప్టెంబర్ 8 చివరి తేదీ.

 

south indian bank

ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని ఇప్పుడు ఎంపిక చేయనున్నారు. విద్యార్హత చూస్తే.. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాస్ కావాలి. వయస్సు వచ్చేసి 2021 జూలై 31 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. అలానే తప్పక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, అర్హన్ కో-ఆపరేటీవ్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సబ్సిడరీలో రెండేళ్లు ఆఫీసర్ కేడర్‌లో పని చేసిన అనుభవం ఉండాలి.

అలానే బ్రాంచ్ ఆపరేషన్స్, లయబిలిటీ సేల్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కలెక్షన్ అండ్ రికవరీ, క్రెడిట్ రీటైల్ అండ్ ఎంఎస్ఎంఈ అండర్‌రైటింగ్, ఎంఎస్ఎంఈ రిలేషన్‌షిప్, సేల్స్ మేనేజర్, గోల్డ్ లోన్ బిజినెస్, క్రెడిట్ మిడ్ ఆఫీస్ ఫంక్షన్స్ విభాగాల్లో పని చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.800. వేతనం రూ.36,000 బేసిక్ వేతనంతో రూ.63,840 వరకు లభిస్తుంది. దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఉండచ్చు. అభ్యర్థులు https://recruit.southindianbank.com/RDC/ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలు చూసి అప్లై చేసుకోవచ్చు.