విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్‌లో ఖాళీలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

దీనిలో మొత్తం 158 ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలవ్యవధి గల పోస్టులు మాత్రమే. ఇక పోస్టుల వివరాలలోకి వెళితే..

మొత్తం ఖాళీలు- 158, ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 8, కెమికల్ ఇంజనీరింగ్- 25, సివిల్ ఇంజనీరింగ్- 8, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్- 15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 10,
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 40, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ- 6, మెకానికల్ ఇంజనీరింగ్- 46.

ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా ఆఫర్ లెటర్ పంపిస్తారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చెరీ రాష్ట్రాల్లో డిప్లొమా పాస్ అయినవారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను https://www.vssc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.

2021 ఆగస్ట్ 4 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చెయ్యచ్చు. విద్యార్హత చూస్తే.. గుర్తింపు పొందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత బ్రాంచ్‌లో మూడేళ్ల డిప్లొమా 60 శాతం మార్కులు పొందాలి. 2018 అక్టోబర్ కన్నా ముందు డిప్లొమా పాస్ అయిన వారు అర్హులు కాదు.

డిప్లొమా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా అర్హులు కాదు. 2021 ఆగస్ట్ 4 నాటికి 30 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news