ఉద్యోగం కోసం చూసే మహిళలకి గుడ్ న్యూస్. కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం జిల్లా లోని అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పాసైన మహిళలు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే…. అయితే దీనిలో మొత్తం 288 పోస్టులు వున్నాయి. అభ్యర్థులు జులై 01 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. టెన్త్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలలోకి వెళితే… అంగన్ వాడీ కార్యకర్త విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. అంగన్ వాడీ సహాయకురాలి విభాగంలో 225 ఖాళీలు ఉన్నాయి. మినీ అంగన్ వాడీ కార్యకర్త విభాగం లో 13 ఖాళీలు ఉన్నాయి. ఆఫ్ లైన్ విధానం లో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://kadapa.ap.gov.in/ వెబ్సైట్లో చూడొచ్చు.
మహిళలు టెన్త్ పాసై ఉండాలి. అలానే వివాహిత మహిళ అయి ఉండాలి. సదరు మహిళ స్థానికంగా నివసిస్తూ ఉండాలి. స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ కార్యాలయం, కడప జిల్లా, ఏపీ చిరునామా లో దరఖాస్తులను నిర్ణీత గడువు లోగా సమర్పించాల్సి ఉంటుంది.
వెబ్సైట్:https://kadapa.ap.gov.in/