జూనియర్ ఫైర్ అండ్ సెఫ్టీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకో వచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, ల్యాబ్ అనలిస్ట్ మొదలైన పోస్టులని భర్తీ చేయనున్నారు.

jobs
jobs

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టుల కి మహిళలూ పురుషులు కూడా అప్లై చేసుకోచ్చు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ కూడా అర్హులే. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. వయస్సు విషయానికి వస్తే.. 30, 45 ఏళ్ల వయస్సు మించరాదు.

పోస్టుల వివరాల లోకి వెళితే.. ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, ల్యాబ్ అనలిస్ట్, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు వున్నాయి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590 గా వుంది. మిగిలిన వారికి ఫీజు లేదు. విద్యార్హతలు పోస్టుని బట్టి వున్నాయి. నోటిఫికేషన్ లో వాటి వివరాలను చూడచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చెయ్యాలి. దరఖాస్తు చివరి తేదీ మే 21, 2022. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి జీతం ఉంటుంది. https://drive.google.com/file/d/1GuXgog4CroRDnJ7HiK6gxGEcztPRSsrb/view లో పూర్తి వివరాలను చూడచ్చు.