కరూర్‌వైశ్యా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

కరూర్‌వైశ్యా బ్యాంక్‌ నిరుద్యోగులు గుడ్‌న్యూస్‌ తెలిపింది. కాంట్రాక్టు ప్రాతిపదికన బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌ ఉద్యోగాల నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌ లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియమక ప్రక్రియకు జీతం తదితర అంశాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23న ప్రారంభమవుతుంది. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.kvb.co.in లో అందుబాటులో ఉంది.

jobs
jobs

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో (10+2+3 లేదా 10+2+5 లేదా 10+2+3+2 లేదా 10+2+4) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో తప్పని సరిగా 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. డిగ్రీ కరస్పాండెంట్‌ కోర్సులు చేసిన వారు అర్హులు కాదు.

ఎంపిక విధానం..

అభ్యర్థులను ముఖాముఖి పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థును ఇంటర్వ్యూకి రావాల్సిన సమాచారం బ్యాంక్‌ అందిస్తుంది.

దరఖాస్తు చేసుకునే విధానం..

  • కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • అందులో కెరీర్‌ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి.
  • అనంతరం రిజిస్టర్‌ యువర్‌సెల్ఫ్‌ ను ఎంపిక చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేసి, అప్‌లోడ్‌ చేయాలి.చివరగా అప్లికేషన్‌ను సబ్‌మిట్‌ చేసి, ఒక దరఖాస్తు కాపీని మీ వద్ద పెట్టుకోవాలి.