వాటే పాలసీ..రోజూ 200 ఆదా చేస్తే.. రూ.28 లక్షలు పొందొచ్చు..!

-

మీరు మీ డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక అదిరే పాలసీ. ఈ పాలసీ తో మంచిగా రాబడి పొందొచ్చు. ఇక ఈ పాలసీ గురించి చూస్తే… LIC జీవం ప్రగతి యోజన (LIC Jeevan Pragati Yojana) లో డబ్బులు పెడితే చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. ఈ పాలసీ లో మీరు రోజూ రూ.200 ఆదా చెయ్యాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్లు చేస్తే… మొత్తం పెట్టిన పెట్టుబడి సుమారు రూ.15 లక్షల దాకా అవుతుంది.

 

 LIC Jeevan Pragati Yojana | LIC జీవం ప్రగతి యోజన
LIC Jeevan Pragati Yojana | LIC జీవం ప్రగతి యోజన

మీకు ఒకేసారి రూ.28 లక్షలు రిటర్న్ ఇస్తారు. ఇది ఇలా ఉంటే ఈ పాలసీ లో మరొక ప్రత్యేకత వుంది. దాని గురించి చూస్తే… ఈ పాలసీ తీసుకుంటే అదనంగా రూ.15,000 పెన్షన్ కూడా ఇస్తారు. ప్రతి ఐదేళ్లకి ఒకసారి దీని రిస్క్ కవర్ కూడా పెరుగుతుంది. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి పెరుగుతుంది.

11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి పెరుగుతుంది. అదే ఒకవేళ మీరు 20 ఏళ్ల వరకూ చెల్లిస్తూ డబ్బులు కనుక తీసుకోకపోతే మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది. ఇలా ఈ పాలసీ తో లాభాలు పొందొచ్చు. ఉదాహరణకి ఎవరైనా రూ.2 లక్షలకు పాలసీ తీసుకుంటే… మొదటి ఐదేళ్ల వరకూ బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.2.5 లక్షలు ఉంటుంది.

అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.3లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.4 లక్షలు ఉంటుంది. 12 నుంచి 45 ఏళ్ల మధ్య వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కనీస గడువు 12 ఏళ్లు, గరిష్ట గడువు 20 ఏళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news