మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్పెషల్ రిక్యూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది.
డెసిషన్ సైన్సెస్, ఎంట్రప్రెన్యూర్షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ రిసోర్సెస్, పబ్లిక్ పాలసీ, ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే..
ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వున్నాయి.
వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్ధుల వయసు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. శాలరీ వివరాల లోకి వెళితే.. నెలకు రూ. 40,000ల నుంచి రూ.66,000ల వరకు చెల్లిస్తారు. ఇక అర్హతలను చూస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఇక ఎలా ఎంపిక చేస్తారు అనేది చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 21, 2022. దరఖాస్తు చెయ్యాల్సిన చిరునామా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఐఐఎం విశాఖపట్నం, ఏయూ క్యాంపస్, విశాఖపట్నం, ఏపీ – 530003. ఈమెయిల్ ఐడీ [email protected].