కవితా రీతులను అర్థం చేసుకునే చక్కని కళాకారిణి
అదేవిధంగా తెలుగు పలుకుకు విలువ ఇస్తూ…
ఉచ్ఛారణ దోషాలు రానివ్వని…
గొప్ప భాషాభిమాని..అందరినీ గౌరవించే వ్యక్తిత్వం…
ఎంపిక చేసుకున్న కళనూ కథనూ అర్థం చేసుకునే అరుదైన లక్షణం ఆమె సొంతం…
ఉదయ భాను అనే ఓ ప్రయోక్త జీవితం గురించి ఇవాళ బ్యూటీ స్పీక్స్ లో…. చదవండిక
అంతా మాట్లాడుకోవడం బాగుంటుంది..అంతా మాట్లాడుకోకుండా ఉండడం కూడా బాగుంటుంది. మాట్లాడడం అన్నది కెరియర్ కు సంబంధించి అయితే బాగుంటుంది.. మాట్లాడుకోకపోవడం అన్నది వ్యక్తిగత జీవితాల గురించి అయితే అర్థవంతం అయి ఉంటుంది ఆ మాట మరియు ఆ నడవడి కూడా ! మన జీవితాల్లో అర్థవంతం అయిన నడవడిని మరియు వ్యక్తిత్వ సంబంధ చర్యలను పెద్దగా పరిగణనలోకి తీసుకోం. పట్టించుకోం అని రాయాలి. అందాల తారల జీవితాల్లో కూడా అర్థవంతమయిన విషయాలు, ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే గెలుపులు మరియు ఓటములు నమోదు అయి ఉంటాయి.మనం గమనించి,ఇతరుల జీవితాల నుంచి మనకు అవసరం అయినవేవో గుర్తించి నడుచుకుంటే చాలు కొన్నింటికి పరిష్కారం దొరుకుతుంది.
అదేవిధంగా వారిని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకుంటే చాలు అన్నీ అవే వాటంతట అవే సర్దుకుపోతాయి. అందాల తారల జీవితాల్లో విషాదాలను, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నాలు కొన్ని మీడియా సమర్థనీయ ధోరణిలో చేస్తే మేలు. ఒకప్పుడు జెమిని టీవీలో యాంకర్ సుమ, యాంకర్ ఝాన్సీతో పాటు పోటీ పడి ఉదయ భాను అవకాశాలు అందుకున్నారు. భారీ చిత్రాల ఆడియో ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరించారు. ఓ విధంగా యాంకర్ గా స్టార్ డమ్ అందుకున్నారు.
రేలా రే రేలా ప్రొగ్రాంతో ఎంతో గుర్తింపు అందుకున్నారు. కాస్త సాహిత్యం తెలిసిన అమ్మాయి ఉదయభాను అన్న గుర్తింపే ఆమెకు ఎంతో ఇష్టం. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసిన ఈ అందం..ఇప్పుడు ఇద్దరి బుజ్జాయిలకు మాతృమూర్తి. ఆ ఇంట ఆ నవ్వులను ఆస్వాదిస్తూ ఉన్నారీమె.తక్కువ అవకాశాలే ఉన్నా కూడా వాటి నుంచి కూడా మంచివే ఎంచుకుని ఒకనాటి హవాను మళ్లీ సృష్టించేందుకు తపిస్తున్నారు. తోటి కళాకారులను ఎంతగానో అభిమానిస్తారు. ఆదరిస్తారు.
ముఖ్యంగా తెలంగాణ మాండలికానికే ఓ గొప్ప గౌరవం తెస్తారు. ఆమె పలుకు నడవడి అన్నవి ఇతరుల కన్నా ప్రత్యేకం. ఆమె జీవితంలో ఉన్న విషాద ఘట్టాలు కూడా ఇతరుల జీవితాల కన్నా విభిన్నం. అయినా ఆమె ఓడిపోలేదు. ఎన్నింటినో సునాయాసంగా దాటుకుని వచ్చారు. తనకు అవకాశాలు రాకుండా ఎందరెందరో ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నా అవి కూడా పట్టించుకోలేదు. సాహిత్యంను ప్రేమిస్తారు. మంచి భాషకు విలువ ఇస్తారు. తెలంగాణ జానపదం అంటే మురిసిపోతారు.
ఉత్తరాంధ్ర బిడ్డలనూ అదే రీతిలో అంతే స్థాయిలో కళా రంగాన ప్రోత్సహిస్తారు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే తన కంట నీరుకు ఉన్న అర్థం ఏంటన్నది చెప్పి అందరినీ ఆ భావోద్వేగాల తీరాలకు చేర్చారు. అదే స్థాయిలో ఇతరుల కష్టాలను అర్థం చేసుకుని ఆమె సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి.ఆ విధంగా ఆమె అంటే ఎంతో గౌరవం ఎందరికో !