ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు… నోటీసులు జారీ చేసింది. 2014 ఎన్నికల సమయంలో….. హుజుర్ నగర్ లో ఎన్నికల కోడ్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉల్లంఘించారు. అయితే.. ఈ కేసును ఇవాళ నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు… విచారణ చేసింది.
ఈ సందర్భంగా… సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కు హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఈ నెల 28 వ తేదీన కోర్టు కు హాజరు కావాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.
అయితే.. దీనిపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది. కాగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు అవినీతి ఆరోపణ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ పై జైలు నుంచి బయటకు జగన్ వచ్చిన సంగతి తెలిసిందే.