Job Notification : తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల!

తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా పోస్టల్‌ శాఖ నుంచి ఉద్యోగ భర్తీలు చేపడుతూనే ఉంది. తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదలకు పూనుకుంది. దీంతో పోస్టల్‌ సర్కిల్‌ విభాగంలో వివిధ ఉద్యోగాలకు భర్తీ చేపట్టనుంది. Government Jobs Notifications

post offcie
Government Jobs Notifications జాబ్‌ నోటిఫికేషన్‌

ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ భర్తీని స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనుంది.

ఇందులో పోస్టల్‌ అసిస్టెంట్‌ విభాగంలో 11 పోస్టులు, ఆర్‌ఎంఎస్‌ ఆఫీసుల్లో 8 అసిస్టెంట్, 25 పోస్టు మ్యాన్, మెయిల్‌ గార్డు విభాగంలో 1, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ విభాగంలో 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో అధికారులు స్పష్టం చేశారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 24 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలకు https://tsposts.in/sportsrecruitment/ వెబ్‌ సైట్‌ ను సందర్శించవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే దరఖాస్తు చేసుకోవాలి.