నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుని తీసుకొచ్చిన ప్రభుత్వం…!

మామూలుగా అయితే బీఈడీ ని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు మరియు ఏదైనా డిగ్రీని పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు. అయితే మామూలుగా బిఈడి చదివే వాళ్ళు బీఏ, బీకామ్, బీఎస్సి వంటి డిగ్రీలు కూడా చెయ్యాల్సి ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసి బీఈడీ చదువుకోవడానికి మొత్తం ఐదు సంవత్సరాలు పడుతుంది.

కానీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ డిగ్రీని తీసుకు వస్తున్నారు. అయితే ఇక విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ డిగ్రీని పూర్తి చెయ్యాలంటే నాలుగేళ్లు పడుతుంది. నాలుగు సంవత్సరాలలో డిగ్రీ మరియు బీఈడీ ని పూర్తి చేయొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోక్రియాల్ నిశాంక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబోయే ఉపాధ్యాయులకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా పాఠ్యప్రణాళిక లో మార్పులు తీసుకు వచ్చారు. ప్రాంతీయ భాష లో బోధించడం, పాఠశాల విద్యార్థులకు కోడింగ్ నేర్పడం మొదలైనవి వచ్చాయి.

ఈ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ని తీసుకు రావడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. అదే విధంగా బీఈడీ కోర్సులలో స్పెషలైజేషన్ కూడా ఉంటుందని గిఫ్టడ్ చిల్డ్రన్ కి ఇది ప్లస్ అవుతుందని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. ఇలా ఈ కోర్సు ద్వారా విద్యార్థులకి మంచి విజ్ఞానం అందుతుంది. అదేవిధంగా రానున్న తరాలకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. తమకు నచ్చిన సబ్జెక్ట్ ని బోధించడానికి విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే విజ‌య‌ప‌థం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.