కలెక్టర్లు బలిసి మాట్లాడుతున్నారు.. హరీష్ రావు కు సిగ్గు అనిపించడం లేదా ? : జగ్గారెడ్డి

మంత్రి హరీష్ రావు చెప్పేవాన్ని అన్ని అబద్ధాలేనని.. ఎప్పుడు ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు..  మంత్రి హరీష్ రావుకు సిగ్గని పించడం లేదా? తెలంగాణలో  కలెక్టర్లు బాగా బలిసి మాట్లాడుతున్నారని అగ్రహించారు.  ఓటు ద్వారానే రైతులు బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలన్నారు. పాము – ముంగిస కొట్లాట లాగా టీఆర్ఎస్ – బీజేపీ కొట్లాట ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ ఆయారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు యాక్టింగ్ లు బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ గాంధీ భావన్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా తో మాట్లాడారు. సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని… రైతులు దేవుళ్ళతో సమానమని పేర్కొన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి

కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలవి డ్రామాలు అని.. రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం లో వరికే ప్రాధాన్యత ఇస్తాం… ఇతర పంటలకు ఇవ్వబోం.. రైతులు పండించిన పంటను ఏమి చేయాలి ? అని నిప్పులు చెరిగారు జగ్గా రెడ్డి. రైతు లకు కాంగ్రెస్ అండగా ఉంటూ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నవంబర్ 2 న చలో సిద్దపేట కు పిలుపు నిచ్చామని వెల్లడించారు. రైతుల కోసం మాట్లాడిన ప్రతి పక్షాలను మంత్రులు బూతులు తిట్టడం పద్ధతి కాదన్నారు. రైతుల కోసం ఎన్ని మాటలైన పడతామని స్పష్టం చేశారు జగ్గా రెడ్డి.