అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు, సర్వీస్‌ వివరాలను నమోదు చేయడానికి గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీలోగా ఆయా వివరాలను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌ సైట్లో అప్‌ లోడ్‌ చేయాలని సూచించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

tspsc
tspsc | టీఎస్పీఎస్సీ

కానీ, దీనికి ఎవరైనా అభ్యర్థులు గడువులోగా సర్టిఫికేట్లు అప్‌ లోడ్‌ చేయకుండా ఉద్యోగాలకు అర్హత కోల్పోతే సర్వీస్‌ కమిషన్‌ కు ఎలాంటి బాధ్యత ఉండదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

ఈ పరీక్షకు మొత్తం 14,409 మంది హాజరు కాగా ఇప్పటి వరకు 4100 మంది సర్వీస్‌ సర్టిఫికేట్ల వివరాలపై స్పందించలేదు. దీంతో టీఎస్పీఎస్సీ అసహనానికి గురైంది.

 

ఇక మరికొందరు సర్వీస్‌ వివరాలకు బదులుగా అర్హతలు నమోదు చేస్తున్నారని దీంతో నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలిపింది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు  https://www.tspsc.gov.in వెబ్‌ సైట్‌ ను సందర్శించాలని సూచించింది. క్షణ్ణంగా ఈ వెబ్‌సైట్‌లోని నియమాలను పాటించాలని ఆదేశించింది.