అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281లో ట్రక్ అతివేగంగా ప్రయాణించిందని, మలుపు తీసుకునే సమయంలో మెటల్ యుటిలిటీ పోల్, డిపిఎస్ సార్జంట్‌లోకి దూసుకెళ్లిందని దక్షిణ టెక్సాస్ అధికారులు తెలిపారు.
వ్యాన్ సామర్థ్యం 15 మంది కాగా, 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. సామర్థ్యం ఎక్కవ కావడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతులంతా స్థానికులు కాదని చెప్పారు. ఈ ఘటనలో వ్యాన్ నుజ్జు నుజ్జు అయింది. అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.