మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. BECIL పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. అక్టోబర్ 24, 2022 దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది.
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ పోస్టులు వున్నాయి. www.becil.com అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజినీర్-1, జూనియర్ ఇంజినీర్-4 పోస్టులు వున్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుకి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందితే అప్లై చేసుకోవచ్చు.
అదే జూనియర్ ఇంజనీర్ పోస్టుకి అయితే కనీసం 55 శాతం మార్కుల తో సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసుండాలి. రెండేళ్ల పని అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక సాలరీ విషయానికి వస్తే.. అసిస్టెంట్ ఇంజినీర్ కి అయితే నెలకు రూ.58,819 వస్తాయి. అదే జూనియర్ ఇంజినీర్ కి అయితే నెలకు రూ.27,000 వస్తాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను www.becil.com అధికారిక వెబ్సైట్ ద్వారా పొందొచ్చు.