సికింద్రాబాద్ రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 24 పోస్టులను రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ భర్తీ చేస్తోంది.

jobs
jobs

పోస్టుల వివరాలను చూస్తే… జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 04, జూనియర్ సివిల్ ఇంజనీర్ 01, ఎగ్జిక్యూటివ్, పర్సనల్ / అడ్మినిస్ట్రేషన్ / హెచ్‌ఆర్‌డీ 09 వున్నాయి. అలానే ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ మరియు అకౌంట్స్ 08, కార్యనిర్వాహక, ప్రొక్యూటర్‌ 02 పోస్టులు కూడా వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం వుంది.

ఇక వయస్సు విషయానికి వస్తే డిసెంబర్ 31 నాటికి 22 నుంచి 28 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు వుంది. అర్హత వివరాలని చూస్తే.. అభ్యర్థులు మూడు ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లొమా ని పూర్తి చేసుండాలి.అయితే వేర్వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి చూసుకోండి. ఇక ఇదిలా ఉంటే ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ, కోల్కత్తా, ముంబయ్, చెన్నై లేదా సికింద్రాబాద్ రైల్వే జోన్లలోని పని చేయాల్సి వుంది. శాలరీ విషయానికి వస్తే రూ.48,852 వరకు పే చేస్తారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధికారిక వెబ్ సైట్ https://cris.org.in/crisweb/design1/index.jsp లో పూర్తి వివరాలు చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news