టెన్త్ పాస్ తో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు.. వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పడవ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ Post Office లో ఉద్యోగం చెయ్యచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతల వివరాల్లోకి వెళ్తే.. 10వ తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అలానే అభ్యర్థులకు మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.

ముంబైలోని భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం మెయిల్ మోటార్ సర్వీసులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. కనుక మోటార్ మెకానిజం కూడా తెలిసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు

ఇక వయస్సు విషయంలోకి వస్తే.. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేదు.

ఈ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆగస్టు 9, 2021 లోపు పంపించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా స్పీడ్‌పోస్ట్‌లో మాత్రమే పంపాలి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో Recruitment అనే సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోనే దరఖాస్తుల్నిపంపాల్సిన చిరునామా: The Senior Manager, Mail Motor Service, 134a, Ahike Marg, Varli, Mumbai.