కరీంనగర్: హుజురాబాద్‌లో ఉపఎన్నిక వేడి రాజుకుంది. ఈటల రాజేందర్ రాజీనామాతో మరోసారి ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. ఇక్కడ గెలిచి నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు ఎదురు లేదని ఆ పార్టీ అధిష్టానం, నేతలు భావిస్తున్నారు. ఇటు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ మరోసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్‌కు తన సత్తా చూపాలని యోచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేయబోతున్నారు. ఉపఎన్నిక జరగనున్న నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రేపు, ఎల్లుండి పాదయత్ర చేపట్టనున్నారు. బత్తురోనిపల్లిని తన సెంట్‌మెంట్ ప్రాంతంగా ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఈ మేరకు బత్తురోనిపల్లి గ్రామం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. గోపాలపురం మీదుగా నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేపట్టి చివరగా జమ్మికుంటలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఈటల పాదయాత్ర ప్రాంభించనున్నారు. ఇక పాదయాత్రలో నియోజకవర్గ ప్రజలకు ఈటల ఏంచేశాడో చెప్పానున్నారు. అలాగే ప్రభుత్వంపై విమర్శలు కూడా చేయనున్నారు.