స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 5,237 ఖాళీలు… వివరాలు ఇవే ..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అసోసియేట్ ఇన్ క్లరికల్ కేడర్ లో పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 5237 ఖాళీలు ఉన్నాయి ఇప్పటికే ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 17, 2021లోగా అప్లై చేసుకోండి. sbi.co.in అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

అప్లై చేసుకునే అభ్యర్థుల కి లోకల్ భాష లో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తప్పక రావాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలు – 27 April 2021
ఆన్లైన్ అప్లికేషన్ కి ఆఖరి తేదీ – 17 May 2021
ప్రీ ఎక్సమ్ ట్రైనింగ్ కాల్ లెటర్ – 26 May 2021
ప్రిలిమ్స్ ఎక్సమ్ తేదీ- June 2021
మెయిన్ ఎక్సమ్ – 31 July 2021

అర్హత విషయంలోకి వస్తే… గుర్తింపు పొందిన విద్యాసంస్థలు నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే. కానీ 16 ఆగస్టు 2021 నాటికల్లా డిగ్రీ పూర్తయి ఉండేటట్లు చూసుకోండి.

అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక జీతం విషయం లోకి వస్తే… క్వాలిఫై అయిన వాళ్ళకి 17,900 నుంచి 47,920 రూపాయల వరకు వస్తాయి. బేసిక్ పే వచ్చేసి రూపాయలు 19,900.

మొదట ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ కి అభ్యర్థులు రావాలి. మెయిన్ ఎగ్జామినేషన్ లో పాసైన వాళ్లకి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష గంట సేపు ఉంటుంది. దీనిలో 100 ఆబ్జెక్టివ్ క్యూస్షన్స్ ఇస్తారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కి ఫీజు మినహాయింపు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news