బిగ్ బ్రేకింగ్: సంగం డైరీ యాజమాన్య హక్కులను బదిలీ చేసేసిన సర్కార్

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డైరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ట్ లో విచారణ జరుగుతూ ఉండగానే సంగం డైరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారు సహకార సంఘానికి బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.

కోర్ట్ లో విచారణ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రోజు వారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తన జీవోలో స్పష్టంగా పేర్కొంది. తెనాలి సబ్ కలెక్టర్ ను ఇంచార్జ్ గా నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ జీవోపై రైతులు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.