రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌లో ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐసీఎంఆర్‌లోని డిబ్రూఘర్‌కు చెందిన రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి భర్తీ చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఐసీఎంఆర్‌ లోని డిబ్రూఘర్‌కు చెందిన రీజినల్‌ మెడికల్ రీసెర్చ్‌ సెంటర్‌ కాంట్రాక్టు బేస్డ్ మీద ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతోంది. దీనిలో మొత్తం ఏడు ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ పోస్టులును ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

వయస్సు వివరాల లోకి వెళితే.. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించి వుండకూడదు. శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.18,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇక ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నది చూస్తే.. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌, డీఎంఎల్‌టీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పని లో కనీసం ఏడాది పాటు అనుభవం ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చూస్తే.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ మే 19, 2022. పూర్తి వివరాలను https://rmrcne.org.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news