అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన డేవిడ్ వార్నర్..!

-

అంతర్జాతీ క్రికెట్‌లో మరో దిగ్గజ ఆటగాడి కెరీర్ ముగిసింది. టీ-20 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించిన అనంతరం.. కంగారు జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్ప‌టికే వ‌న్డేలు, టెస్టుల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన వార్న‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తన చివరి ఆట అని చెప్పిన విషయం తెలిసిందే. భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ లో, వార్నర్ 6 పరుగులే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరోవైపు బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్‌ గెలవడం వల్ల టీ-20 ప్రపంచకప్‌ సెమీస్‌ చేరే అవకాశం ఆస్ట్రేలియాకు లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలుకుతున్నట్లు వార్నర్‌ ప్రకటించాడు.

జనవరి 06, 2024న టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు వార్నర్. అలాగే వన్డేలకు కూడా గుడ్ బై చెప్పాడు. తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగనున్న ఛాంపియన్స్ ట్రోపీలో ఆడతానని అతను చెప్పాడు. కానీ అది జరుగుతుందని ఆశించలేము. 110 టీ-20లలో 3277 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version