ఐపీఎల్ మ్యాచులపై బీసీసీఐ కీలక ప్రకటన

-

కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెల్సిందే. కోల్‌క‌తా, చెన్నైల‌కు చెందిన ప‌లువురు ప్లేయ‌ర్లు, సిబ్బందికి కోవిడ్ రావ‌డంతో ఐపీఎల్‌ను అక‌స్మాత్తుగా వాయిదా వేశారు. అయితే టోర్నీలో 29 మ్యాచులే జరగగా మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10 లోపు పూర్తి చేయాలని చూస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లపై మరో కీలక ప్రకటన చేసింది బీసీసీఐ.

తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 19 ఐపీఎల్ టోర్నీ తిరిగి ప్రారంభించి.. అక్టోబర్ 19న ఫైనల్ తో ముగించాలని భావిస్తున్నట్లు ఓ bcci అధికారి మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వాహకులతో పాటు అధికారులతో చర్చలు జరిపామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 31 మ్యాచుల కోసం బిసిసిఐ 25 రోజుల విండో కావాలని ఆశించినట్లు ఆయన వెల్లడించారు. ఐపీఎల్ జరగకపోతే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news