బిగ్‌బాస్ ఫైన‌ల్ గెస్ట్‌లు ఫిక్స్‌… స్టార్ డైరెక్ట‌ర్‌.. హాట్ హీరోయిన్లు

-

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మూడున్న‌ర నెల‌ల‌కు పైగా ఎంట‌ర్టైన్ చేస్తోన్న బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో ఫైన‌ల్ కొద్ది సేప‌ట్లో ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కొరకు బిగ్ బాస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ కు చేరిన రాహుల్,శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, అలీ రెజాలలో ఒకరు టైటిల్ విన్నర్ గా నిలవనున్నారు.

ఇక ఈ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వ‌చ్చే ముఖ్య అతిథులు ఎవ‌రో ? తెలిస్తే మీరు మామూలుగా ఎగిరి గంతేయ‌రు. స్టార్ డైరెక్ట‌ర్‌తో పాటు హాట్ హీరోయిన్లు కూడా ఈ ఫినాలేకు గెస్టులుగా వ‌చ్చారు. ఇక ప్రతి రోజూ పండగే చిత్రానికి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్న తరుణంలో ఆ సినిమా డైరెక్ట‌ర్ రాశీఖ‌న్నాతో పాటు డైరెక్ట‌ర్ మారుతి గెస్టులుగా వ‌చ్చారు.

ఇక వీరిద్ద‌రితో పాటు క్రేజీ హీరోయిన్లు అంజలి, క్యాథరిన్ కూడా వ‌చ్చారు. ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్‌ కులకర్ణి పాడిన రాములో రాములా.. పాటతో స్టేజీ హోరెత్తిపోతున్న‌ట్టు తాజా ట్రైల‌ర్ చెప్పేసింది. ఇక సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కూడా వ‌చ్చారు. శ్రీకాంత్‌ తనకు పునర్నవి ఇష్టమైన కంటెస్టెంట్‌ అని చెప్పడంతో ఆమె సిగ్గులు ఒలకబోసింది.

బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌కు తారలతోపాటు ఇంటి సభ్యుల కుటుంబాలు కూడా విచ్చేశాయి. ఇంటి సభ్యులను ఎలిమినేట్‌ చేయాల్సిన బాధ్యతను నాగ్‌.. అంజలి, రాశి ఖన్నాకు అప్పగించాడు. ఇక ఫైన‌ల్‌గా మిగిలిన ఇద్ద‌రిలో ఒక‌రు విన్న‌ర్‌… మ‌రొక‌రు ర‌న్న‌ర్ అవుతారు. ఇక మొద‌ట‌గా ఇంటి నుంచి అలీ ఎలిమినేట్ అయ్యాడంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news