ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి అవుట్ ఎవ‌రంటే…

-

తెలుగు బుల్లితెర షో బిగ్‌బాస్ విజ‌య‌వంతంగా 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికే 86 రోజులు కంప్లీట్ చేసుకున్న షో ప్ర‌స్తుతం ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంది. ఇక షోలో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్ల‌తో హౌస్‌లో మంచి ర‌స‌వ‌త్త‌ర పోరు న‌డుస్తోంది. ఈ ఏడుగురు కంటెస్టెంట్ల‌లో అంద‌రూ ఈ వారం ఎలిమినేష‌న్‌కు ఎంపిక‌య్యారు.

ఇక ఈ వారం ఎలిమినేష‌న్ విష‌యానికి వ‌స్తే వ‌రుణ్ సందేశ్ భార్య వితిక షెరు ఖ‌చ్చితంగా ఎలిమినేట్ అవుతుంద‌ని సోష‌ల్ మీడియా ట్రెండ్స్ చెపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో ఎన్ని పోల్స్ పెడుతున్నా అన్నింట్లోనూ ఆమె వీక్ కంటెస్టెంట్‌గా ఓటింగ్ స‌ర‌ళి చెపుతోంది. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్ల‌కు క‌లిపి 50 శాతం ఓట్లు వ‌స్తే… వితిక‌కు మాత్ర‌మే 50 శాతం ఓట్లు వ‌స్తున్నాయి.

ఇక ముందు నుంచి వీక్ కంటెస్టెంట్‌గానే ఉన్న వితిక చాలా సార్లు ల‌క్‌తో బ‌య‌ట ప‌డింది. ఒక సారి కెప్టెన్‌గా సేవ్ అవ్వ‌డం.. మ‌రోసారి బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ త్యాగం చేయటంతో పాటు మరో రెండుసార్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేష‌న్లో ఉన్న‌ప్పుడు ఆమె ఎలిమినేష‌న్ జోన్లో లేక‌పోవ‌డంతో సేవ్ అయ్యింది. ఇక చివ‌ర్లో వ‌రుణ్ భార్య‌పై ప్రేమ‌తో ఆమెను సేవ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

వితిక‌ను సేవ్ చేసే క్ర‌మంలో వ‌రుణ్ సైతం పంతానికి పోయి తాను టైటిల్ గెలిచే అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంటున్నాడు. రాహుల్ శివజ్యోతితో మాటల యుద్ధానికి దిగడం ద్వారా తనకున్న మిస్ట‌ర్ కూల్ ట్యాగ్‌లైన్ కూడా పోగొట్టుకుంటున్నాడు. ఏదేమైనా భార్య కోసం వ‌రుణ్ సేఫ్ గేమ్ ఆడుతూ త‌న ర్యాకింగ్‌ను త‌గ్గించుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news