బిగ్‌బాస్‌: తారుమారైన ఓటింగ్‌…. ఎలిమినేష‌న్లో ఎవరంటే..

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పుడు ఒక్కో కంటెస్టెంట్ తాలూకా కుటుంబ సభ్యులను పంపుతున్న విషయం తెలిసిందే. త‌మ కుటుంబ స‌భ్యులు వ‌చ్చిన‌ప్పుడు కంటెస్టెంట్లు చాలా ఎమోష‌న‌ల్‌గా ఫీల‌వుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో అలీ చేసిన పనికి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.బాబా ఇంట్లో అందరికి వండిపెడతారన్న సంగతి అందరికి తెలిసిందే. బాబా వంటలపై అలీ చేసిన కామెంట్స్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో బలైపోయారు.

నిన్న‌టి ఎపిసోడ్లో రాహుల్ త‌ల్లి బాబా వంటలను ఉద్దేశించి మెచ్చుకోగా అందుకు వెంటనే అలీ అందుకొని తాము బాబా వంటలు తినలేకపోతున్నాం అన్నట్టుగా వెటకారం చెయ్యడంతో నెటిజన్స్ అలీపై కామెంట్స్ చేస్తున్నారు. అస‌లు ఓటింగ్ లేకుండా ఆలీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఎక్కువ… అలాంటిది ఇప్పుడు హౌస్‌లోకి వ‌చ్చి బాబాపై కామెంట్లు చేయ‌డం చాలా త‌ప్ప‌ని నెటిజ‌న్లు ఆలీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక ఈ వారం ఎలిమినేష‌న్ జోన్లో అంద‌రూ ఉండడంతో వితికా బ‌య‌ట‌కు వెళ్లిపోతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. సోష‌ల్ మీడియా ట్రెండ్స్‌, పోల్స్ కూడా వితికానే బ‌య‌ట‌కు వెళుతుంద‌ని చెపుతూ వ‌చ్చారు. అయితే ఆలీ తీరులో స‌డెన్‌గా మార్పు రావ‌డంతో రెండు రోజుల నుంచి వితిక‌కు పోటీగా ఆలీకి కూడా ఓట్లు ప‌డుతున్నాయి.

ఇక ఫైన‌ల్ ఓటింగ్ ముగిసేస‌రికి ఆలీ వితిక‌ను క్రాస్ చేసి ఎలిమినేష‌న్లో ఫ‌స్ట్ ప్లేస్‌కు వెళ్లిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌న్న‌ట్టుగా ట్రెండ్స్ ఉన్నాయి. ఒక‌వేళ డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటే వితిక‌, ఆలీ ఇద్ద‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌ని లేదు.