Bigg Boss Telugu 3 : బిగ్‌బాస్‌లోకి గ్లామ‌ర్ హీరోయిన్ ఎంట్రీ..!

-

నెల రోజుల క్రితం ప్రారంభ‌మైన తెలుగు బిగ్‌బాస్ చాలా ర‌స‌వ్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా నాలుగు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం ఎలిమినేషన్ కి గాను ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. మరి ఈ ఏడుగురిలో ఎవ‌రు ? ఎలిమినేట్ అవుతారా ? అన్న‌ది చూడాలి. అషురెడ్డి, రాహుల్ సిప్లిగంజ్ పేర్లు ప్ర‌ముఖంగా ఎలిమినేష‌న్లో వినిపిస్తున్నాయి.

ఇక హౌస్ నుంచి తొలి నాలుగు వారాల్లో వ‌రుస‌గా హేమ‌, టీవీ 9 యాంక‌ర్ జాఫ‌ర్‌, ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి, నాలుగో వారంలో మ‌రో సీరియ‌ల్ న‌టి రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోప‌ల‌కు వ‌చ్చిన త‌మ‌న్నా సింహాద్రి రెండు వారాల‌కే త‌న విపరీత ప్ర‌వ‌ర్త‌న‌తో బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

త‌మ‌న్నాకు హౌస్ లోప‌ల‌, బ‌య‌ట కూడా శ‌త్రువులు ఎక్కువైపోయారు. దీంతో నెటిజ‌న్లు కూడా ఆమెను ప‌ర‌మ చెత్త కార్డు ఎంట్రీ అని సెటైర్లు వేసి పంపేశారు. త‌మ‌న్నా ఉన్నన్ని రోజులు హౌస్‌లో మామూలు ర‌చ్చ న‌డ‌వ‌లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు హౌస్‌లోకి మ‌రో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉంద‌ని తెలుస్తోంది. ఈ లిస్ట్ లో శ్రద్ధాదాస్, ఈషా రెబ్బ వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో తెలుగు అమ్మాయి అయిన ఈషానే లోప‌ల‌కు పంపాల‌ని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు డిసైడ్ అయ్యార‌ట‌. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలతో నటిస్తున్న ఈషా రెబ్బ హీరోయిన్‌ గా స‌రైన‌ హిట్ అందుకోలేక పోతోంది. మరి బిగ్ బాస్ షో తోనైనా ఈమె ఇమేజ్ మారుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news