బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే ముఖ్య అతిథిగా మెగాస్టార్

-

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. ఇటీవల బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, శివజ్యోతి ఎలిమినేషన్ కు నామినేట్ కాగా, వారిలో శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక ఇప్ప‌టికే గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్ ను కూడా ఆహ్వానించారట.

ఈ క్ర‌మంలోనే ఈ సీజన్ ఫైనల్ విన్నర్‌ను ప్రకటించేందుకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారట. దీనికి మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని సమాచారం. ఏదేమైన మెగాస్టార్ చిరంజీవి ద్వారా బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీని తీసుకునే అదృష్టం ఎవ‌రు సొంతం చేసుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version