బిగ్‌బాస్‌: పెళ్లాం కంటే మొగుడే ఎక్కువ చేస్తున్నాడు..

-

బిగ్‌బాస్ క్లైమాక్స్ వేళ ఒక్కొక్క‌రి మాస్క్‌లు ఊడిపోతున్నాయి. ఎవ‌రికి వారు అస‌లు రంగు బ‌య‌ట పెట్టేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు హంట్‌ అండ్‌ హిట్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో త‌మ గురించి మిగిలిన కంటెస్టెంట్లు మాట్లాడిన వీడియోలు చూపించడంతో వారు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఇక ఆలీకి కూడా బిగ్‌బాస్ కొన్ని వీడియోలు చూపించాడు.

ఈ వీడియో చూశాక ఆలీ వ‌రుణ్ సందేశ్‌పై సెటైర్ వేశాడు. శ్రీముఖితో మాట్లాడుతూ పెళ్లాం కన్నా మొగుడు ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడంటూ వరుణ్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కోపాన్నంతా శ్రీముఖి ఫోటో ఉన్న కుండను బద్ధలు కొట్టడంలో చూపించాడు. ఇక వరుణ్‌.. అతని భార్య కోసం ఆడుతున్నాడన్న అలీ మాటలకు అతని ఫొటో ఉన్న కుండను ముక్కలు ముక్కలు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news