దేశ బడ్జెట్ గురించి ఇప్పుడు యావత్ దేశం అంతా.. ఎదురుచూస్తోంది.. వారం రోజులుగా అందరూ ఈ బడ్జెట్ గురించే చర్చించుకుంటున్నారు. ఈసారి బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు, ఏం మార్పులు వస్తాయి ఇవన్నీ అంచనాలు, ఊహాగానాలు ఎన్నో ఉన్నాయి.. అసలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థికమంత్రి నిర్మాలసీతారామన్ ఆర్థిక పరిస్థితి ఏంటో మీకు తెలుసా..? ఆమెకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, జీతం ఎంత..? ఇవి తెలుసుకుందాం..!
సీతారామన్ లండన్‌లోని హాబిటాట్ సెంటర్‌లో సేల్స్‌పర్సన్‌గా పనిచేశారు. అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ (UK)లో అసిస్టెంట్ ఎకనామిస్ట్‌గా కూడా పనిచేశారు. అలాగే, భారత ప్రభుత్వ జీతాల డేటా ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలవారీ జీతం దాదాపు రూ. 4,00,000 అని వెబ్‌సైట్ పేర్కొంది. ఇతర క్యాబినెట్ మంత్రులతో పోలిస్తే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తులు చాలా తక్కువ. దాదాపు రూ.1.34 కోట్ల ఆస్తులున్నాయి. ఆమె, భర్త పేరిట ఉన్న ఇంటి విలువ రూ.99.36 లక్షలు. దీంతోపాటు దాదాపు రూ.16.02 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది.
భారతదేశ చరిత్రలో వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండో ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్రకెక్కబోతున్నారు. ఇంతకుముందు, మొరార్జీ దేశాయ్ 5 పూర్తి, 1 మధ్యంతర బడ్జెట్‌లను కూడా సమర్పించారు. అయితే ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్ తర్వాత మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హాలను సీతారామన్ ఓడించనున్నారు. వీరందరికీ వరుసగా 5 బడ్జెట్లు సమర్పించే అవకాశం వచ్చింది. అయితే సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి తన రికార్డును బద్దలు కొట్టబోతున్నారు.
మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి?
మధ్యంతర బడ్జెట్ వార్షిక లేదా సాధారణ బడ్జెట్ కంటే చిన్నది. ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆదాయ, వ్యయాల అంచనాలను అందజేస్తుంది. తద్వారా పెట్టుబడిదారులకు మార్కెట్‌పై నమ్మకం కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వ పూర్తి బడ్జెట్ వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఇది పెద్ద ప్రకటనలు చేయడాన్ని నివారిస్తుంది.
కాగిత రహితంగా మధ్యంతర బడ్జెట్…
గత మూడేళ్ల బడ్జెట్ మాదిరిగానే ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ కూడా కాగిత రహితంగా ఉండబోతోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, గ్రాంట్స్ కోసం డిమాండ్, ఫైనాన్స్ బిల్లుతో సహా అన్ని బడ్జెట్ పత్రాలు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం తర్వాత, ఇది ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్‌ఫారమ్‌లలో ‘యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్’లో అందుబాటులో ఉంటుంది.