76 ఏళ్లలో మన దేశ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆర్థిక రంగాల్లో మార్పులు..

-

200 ఏళ్ల కు పైగా మన దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పాలించింది..చరిత్రలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత కలిగిన భారత్.. వాస్తవంలో మాత్రం చాలా వెనుకబాటుకు గురైంది. బ్రిటీష్ సామ్రాజ్యాధినేతలు మన దేశాన్ని సర్వం దోచుకున్నారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అయినప్పటికీ మనవాళ్లు ఏమాత్రం కుంగిపోలేదు. స్వాతంత్ర్యానంతరం దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. మెట్టు మెట్టు ఎక్కుతూ.. ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారు..

 

ప్రపంచ దేశాలలో ఎవరికీ లేని విధంగా రాజ్యాంగాన్ని రచించి గర్వంగా తలెత్తుకునెలా చేసింది..ఒక్కో రంగంలో ఎన్నో విజయాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నారు.ప్రపంచంలో ఏ దేశంలో లేని స్వేచ్ఛ సమానత్వపు హక్కులను మన భారతదేశ పౌరులు అనుభవిస్తున్నారంటే అది నాటి మేధావులు, స్వాతంత్ర్యోద్యమకారుల కృషి ఫలితమనే చెప్పాలి. మొత్తానికి ఫీనిక్స్ వలె ఇండియా పైకి లేచి.. ప్రపంచంలోనే శక్తివంతమైన, అభివృద్ధి చెందుతున్న దేశంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది..భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతుంది..

ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసెలా ఆరోగ్య వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి..ఎన్నో రోగాలకు మందులను కనిపెట్టారు.. అద్బుతాలను సృష్టించారు. వైద్య సేవల్లో ప్రపంచమే అశ్చర్యపోయే స్థాయికి భారత్ చేరింది. భారత్‌‌కు చెందిన అనేక మెడిసిన్ కంపెనీలు ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు ఇండియాలోనే మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టించిన సమయంలో.. భారత శాస్త్రవేత్తలు అమోఘమైన కృష్టితో మందు కనిపెట్టారు. కరోనా మందు కనిపెట్టి యావత్ దేశ ప్రజలకు టీకా ఇవ్వడంతో పాటు.. ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతి చేసి ఔరా అనిపించుకుంది ఇండియా…

భారతదేశ అభివృద్ధి విద్య కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇదే విద్యను కీలకంగానూ మార్చింది. విద్యా హక్కు చట్టం – 2010 ద్వారా అందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యను పొందడం ప్రతి ఒక్కరి హక్కుగా ఈ చట్టం ధృవీకరిస్తుంది..

ఆర్థిక పరమైన అంశాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో టాప్ 4 ఆర్థిక శక్తిగా ఇండియా నిలిచింది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గడిచిన కాలంలో బ్యాంకింగ్ సెక్టార్‌లో సాంకేతిక అభివృద్ధి ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా డిజిటల్ పేమెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి. 1947 నుండి సాధించిన విజయాలు మన దేశ సామర్థ్యానికి నిదర్శనాలు. పైన పేర్కొన్నవే కాకుండా సాంకేతిక రంగంలో, పరిశ్రామికంగా, సేవల రంగంలో క్రీడా రంగంలో, సినిమా రంగంలో, అందాల పోటీల్లో, రవాణా వ్యవస్థలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో భారతదేశం రికార్డులను బ్రేక్ చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news