Independence Day 2023 : రెండు వందల ఏళ్ల బానిస బతుకుల తర్వాత మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఈ ఉద్యమ పోరులో మరణించిన వారెందరో. కుల, మతాలకు అతీతంగా జరుపుకే పండుగ జెండాపండుగ. వలస పాలనకు చరమగీతం పాడి.. దేశ ప్రజలంతా ఒక్కటై ఉద్యమంలో ముందుకు సాగారు. ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి.. చివరికి బ్రిటీష్ వారిని సాగనంపాం. మరికొద్ది రోజుల్లో ఇండియా 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ తరుణంలో.. మన దేశ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యత గురించి ఇంకాస్త తెలుసుకుందాం.!
ఈ ఏడాది థీమ్..
కేంద్ర ప్రభుత్వం ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌గా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్ (Nation First, Always First)’ అనే థీమ్‌ని నిర్ణయించింది ఈ థీం ఆధారంగానే ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉంటాయి.
ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ స్వాతంత్ర్యానికి ముందే
స్వాతంత్ర దినోత్సవ చరిత్ర బ్రిటిష్ వలస పాలకులు భారత్‌కు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇచ్చారు. అయితే అంతకుముందే, జులై 4 1947న బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్‌ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత జూలై 18 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ రూపొందింది. భారత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య రూపొందించారు. ఆగస్టు 15 1947న పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారతంలో తొలిసారి రెడ్ ఫోర్ట్‌లోని లాహోరీ గేటు వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు.
మహాత్మా గాంధీ నాయకత్వంలో..
ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. భారతదేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో నష్టపోయింది. ఆ తరువాత క్రమంగా దేశ ప్రజల్లో చైతన్యం పెరిగింది. వలస పాలనకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. తమకు సాధ్యమైన విధానాల్లో పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ఒక వేదిక లభించింది. ఆ తరువాత, మహాత్మా గాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతా ఒక్కటిగా సత్యాహింసలు ఆయుధాలుగా పోరాటం సాగించింది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అహింసాయుత మార్గంలో భారత్ స్వాతంత్రం సాంపాదించింది. అయితే దీనిపై ఇప్పటికే కొందరికి ప్రశ్నలు ఉన్నాయి. అహింసాయుత మార్గంలో పోరాటం చేస్తే.. అంత మంది స్వాతంత్ర్య ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు.? కాయిన్‌కు ఒక్క సైడ్ మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. కానీ తెలియాల్సింది చాలా ఉంది. కొన్నిపుస్తకాల్లో స్వాతంత్ర్య ఉద్యమం గురించి జనాలకు తెలియని ఎన్నో నిజాలను ఇచ్చారు. మహాత్మగాంధీ నిజంగా మహాత్ముడేనా అప్పట్లో ప్రజలు ఏం అనుకునేవారు, అంతర్గతంగా ఎలాంటి రాజకీయాలు జరిగాయి అనేది పుస్తకాల్లో వివరించారు.