రాఖీ పౌర్ణమి రోజున సోదరి అందమైన దారపు పోగును ఎందుకు కడుతుందో తెలుసా?

-

రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగ. ముఖ్యంగా మహిళలు రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు.. తమ సోదరులకు ఏ రాఖీ కట్టాలి.. ఏ స్వీట్ తినిపించాలి.. అంటూ తెగ ఆరాటపడుతుంటారు. అయితే.. రాఖీల పండుగ అంటే కేవలం రాఖీలు కట్టి నుదట బొట్టు పెట్టి స్వీట్ తినిపించడమేనా? అసలు రాఖీలు కట్టడం వెనుక ఏదైనా మర్మం ఉందా? ఓ దారపు పోగునే సోదరులకు ఎందుకు కట్టాలి. అది కూడా పౌర్ణమి రోజున? వీటిలో ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తున్నది కదా.. అవును.. ఉంది.. రాఖీ పండుగ చాలా విశిష్టత ఉంది. దీనిలో దేవరహస్యం కూడా దాగి ఉందట. కానీ.. అతికొద్ది మందికి మాత్రమే రాఖీ పౌర్ణమి విశిష్టత తెలుసు. మరి.. ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం పదండి..

ప్రతీ ఏటా శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు మన దేశం మొత్తం రాక్షా బంధన్ జరుపుకుంటుంది. సోదరి రాఖీని తన సోదరుడికి కడుతుంది. అయితే.. పౌర్ణమి అంటేనే చంద్రుడు నిండు ప్రకాశంతో వెలుగుతూ కనిపిస్తాడు. రాఖీ అంటే నిండు ప్రకాశం గత చంద్రుడని అర్థం. అందుకే మనిషి ఆత్మలను చంద్రుడితో పోలుస్తారు. మనిషి ఆత్మలు జనన, మరణ కాలచక్రంలోకి రావడం వల్ల తమకు ఉన్న ప్రకాశం, పవిత్రతను కోల్పోతాయట. అంటే మనిషిగా పుట్టారంటే ఆ ఆత్మకు ప్రకాశం ఉండదు. పవిత్రత ఉండదు. దీంతో మనిషిగా ఉన్నప్పుడే మనిషి ఆత్మను ప్రకాశింపజేయడం కోసం సోదరి రూపంలో దేవుడు ఈ రాఖీని కట్టిస్తాడట.

రాఖీ కట్టడానికంటే ముందు సోదరి తన సోదరుడి నుదిటిన బొట్టు పెడుతుంది. మనిషి ఆత్మ నుదిటిన ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సోదరి నిండు పౌర్ణమి నాడు సోదరుడి నుదిటిన బొట్టు పెడితే ఆ ఆత్మ ప్రకాశవంతమై పవిత్రతను సంతరించుకుంటుందట. అందుకే రాఖీ కట్టేముందు సోదరి తన సోదరుడి నుదుట బొట్టు పెడుతుంది. అనంతరం రాఖీ కట్టి నోరును తీపి చేస్తుంది. నోరును తిపి చేయడం వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉందట. తీపి ఎంత మధురంగా ఉంటుందో.. మనమంతా ఎప్పుడూ మధురమైన మాటలే మాట్లాడాలని.. మన వ్యవహారం కూడా మధురంగా ఉండాలని అనే ఉద్దేశంతోనే నోరు తీపి చేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news