కృష్ణాష్టమి అంటే కృష్ణుని జన్మదినం. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి నాడు వస్తుంది. ఆరోజు శ్రీ కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 30వ తారీఖున వచ్చింది. అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఏ ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టాలి అనే వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా దేవుడికి నైవేద్యం అంటే అప్పుడే వండిన శాకాహార ఆహారపదార్థాలు మాత్రమే పెడతారు. అయితే వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువ ఆహార పదార్థాలని తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా అర్పిస్తారు. శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమి రోజు నైవేద్యం కింద పెట్టవలసిన ఆహార పదార్థాలు మీకోసం.
పాయసం:
పాయసాన్ని శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమి సందర్భంగా నైవేద్యం పెడతారు. యాలుకల పొడి, డ్రై ఫ్రూట్స్, సేమ్యా లేదా బియ్యం తో ఈ పాయసాన్ని తయారు చేస్తారు.
అటుకులు ప్రసాదం:
చాలా మంది అటుకులు, బెల్లం కలిపి నైవేద్యం పెడుతూ ఉంటారు లేదు అంటే పంచదార పాకంలో అటుకులు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కూడా చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ కూడా ఎంతో బాగుంటుంది.
అప్పాలు:
బియ్యం పిండితో మరియు బెల్లంతో ఈ రెసిపీ తయారు చేస్తారు. ఇది కూడా మంచి స్వీట్ రెసిపీ. దీనిని కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యం పెట్టచ్చు.
మాఖన్ మిస్రీ:
తాజాగా తయారు చేసిన వెన్నెలో కొద్దిగా పంచదార వేసి శ్రీకృష్ణుడు కి నైవేద్యం పెడతారు.
పంచామృతం:
తాజా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తులసి ఆకులు మరియు వెన్నని కలిపి దేవుడికి అర్పిస్తారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శ్రీకృష్ణుడికి ఆహార పదార్థాలు చేసి నైవేద్యం పెడతారు. వీటిని కూడా తప్పక నైవేద్యం పెడతారు.