ఉపాధ్యాయ దినోత్సవం: ప్రాముఖ్యత.. సందేశాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు

-

సెప్టెంబర్ 5.. ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని దేశ వ్యాప్తంగాఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, భారత మొదటి ఉపరాష్ట్రపతి, ఇలా ఎన్నో సత్కారాలు అందుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుని ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ జీవితంలో మీకెంతో ప్రోత్సాహం అందించి, వెన్నుతట్టిన ఉపాధ్యాయులకు సందేశాలు పంపించండి.

 

teachers day

నా జీవితంలో నన్ను ప్రోత్సహించి, నన్ను ముందుకు నడిపించినవారు ఒక్కరే ఉన్నారు. అది మీరే.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మాస్టారు.

నేను జీవిస్తున్నందుకు మా నాన్నకు రుణపడి ఉంటాను. కానీ ఇంతబాగా జీవిస్తున్నందుకు మా గురువుకు రుణపడి ఉన్నాను.- అలెగ్జాండర్

ఈ భూమి ఇంత అందంగా ఉండడానికి కారణం, ఇక్కడ ఉపాధ్యాయుడు ఉండడమే కారణం.

నాకేమీ తెలియదని, నాకేమీ రాదని అనుకున్నప్పుడు కూడా నీలో ఉన్న జ్ఞానం నీకే తెలియదని, నన్ను పూర్తిగా నమ్మి అంధకారంలో ఉన్న నాపై వెలుగులు ప్రసరించేలా చేసిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

అవినీతి లేని సమాజం కావాలనుకున్నప్పుడు ఆ దేశంలో ముగ్గురు మనుషులు కరెక్టుగా ఉండాలి. అందులో అమ్మా నాన్న ఇద్దరైతే మూడవ స్థానం ఉపాధ్యాయులదే- డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.

మంచి బోధన అనేది మంచి సమాధానాలు చెప్పడం కాదు, మంచి ప్రశ్నలు అడిగేలా చేయడం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

ఒక పుస్తకం, ఒక కలము, ఒక ఉపాధ్యాయుడు.. వీరిని గుర్తుపెట్టుకుంటే చాలు. జీవితంలో చాలా మార్పు వస్తుంది.- మలాలా యూసఫ్ జాయ్.

Read more RELATED
Recommended to you

Latest news