నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ: కేసీఆర్‌

-

తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం వేదికగా ప్రసంగిస్తున్నారు. 2014 జూన్ 2న సీఎంగా.. రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చానని.. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని కేసీఆర్ తెలిపారు. కరోనా వల్ల తొమ్మిదేళ్లలో మూడేళ్లు వృధాగా పోయాయని.. మిగిలిన ఆరేళ్లలోనే రాష్ట్రం ప్రగతి శిఖరాలు అధిరోహించిందని తెలిపారు. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా మారిందని ఉద్ఘాటించారు.

“నేటినుంచి 21 రోజులపాటు దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలి. రాష్ట్రం ఏర్పడిన రోజు ఏ రంగంలో చూసినా విధ్వంసమే. అస్పష్టతలు, అవరోధాలు అధిగమిస్తూ పురోగమిస్తున్నాం. దేశంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా తెలంగాణ ఎదిగింది. తెలంగాణ దృక్పథంతో విధానాల రూపకల్పన జరిగింది. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనేదే మా నినాదం. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించింది. తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధితో పెద్ద రాష్ట్రాలను దాటాం. తలసరి విద్యుత్ వినియోగంలో మనదే ప్రథమ స్థానం. ఎత్తిపోతల పథకాలతో బీడుభూములన్నీ సస్యశ్యామలం. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలుస్తోంది” అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news