మహిళా సంక్షేమంలో యావత్‌ దేశానికి ఆదర్శం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

-

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌.. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందర్నీ కంటికి రెప్పలా కాపాడుకుంటోందని తెలిపారు. ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం అని.. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమ్మఒడి వాహనమైనా.. ఆరోగ్యలక్ష్మి పథకమైనా.. నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హర్షం దక్కిందని అన్నారు.

కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదు… ఒక విప్లవం అని కేటీఆర్ అన్నారు. “భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా… ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా… కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని మనసారా ఆశీర్వదిస్తున్న యావత్ మహిళా లోకానికి… దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news