జనసేన అధినేత పవన్ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఇంతకాలం సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్న ఆయన..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఎన్నికలు దగ్గరపడటంతో పవన్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీలో 11 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు పవన్ రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 14 నుంచి అన్నవరంలో వారాహికి పూజ చేసి..ప్రత్తిపాడు నుంచి యాత్ర మొదలుపెట్టనున్నారు. చివరికి భీమవరంతో మొదట విడత యాత్ర ముగుస్తుంది. తర్వాత మళ్ళీ బస్సు యాత్ర ప్లాన్ చేసుకుంటారు.
ఇక ఏపీతో పాటు తెలంగాణపై కూడా పవన్ ఫోకస్ పెట్టారు. తాజాగా తెలంగాణ జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఇదివరకే పవన్..జనసేనకు కాస్త పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో కూడా కొన్ని సీట్లలో జనసేనకు బలం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన 26 స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టారు. దీని బట్టి చూస్తే పవన్ తెలంగాణలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.
పటాన్‌చెరు, సనత్ నగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, నాగర్ కర్నూలు, వైరా, ఖమ్మం, మునుగోడు, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, కోదాడ, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టారు.
అయితే ఈ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక టిడిపి, బిజేపిలతో పొత్తు తెలంగాణలో కూడా ఉంటుందా? లేదా? అనేది చూడాలి. ఇలా జనసేన పోటీ చేయడంవల్ల..ఆ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువే ఉన్నాయి. కానీ కొన్ని స్థానాల్లో ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది. ఆ ఓట్ల చీలిక ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందో చూడాలి.