ఉప్పల్‌ భగాయత్‌లో మొక్కలు నాటిన ఎంపీ సంతోశ్ కుమార్‌

-

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. హరితోత్సవంలో పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే ఔట్‌లో నిర్వహించిన హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఎంపీ సంతోశ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, పార్టీ నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొక్కలు నాటిన ప్రతిఒక్కరిని ఎంపీ సంతోశ్ కుమార్ అభినందించారు. హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. తొమ్మిదేళ్లలో ఓవైపు హరితహారం, మరోవైపు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా ప్రజల్లో పచ్చదనంపై చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగమై.. పర్యావరణహితానికి తమ వంతు కృషి చేయాలని ఎంపీ సంతోశ్ కుమార్ కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news