ద్వారంపూడిని ఓడించాలంటే పవన్ ఏం చేయాలో తెలుసా?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఎక్కువగా ఏ ఎమ్మెల్యేనైనా టార్గెట్ చేసి విమర్శించారా? అంటే ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెప్పవచ్చు. ఆయన్ని టార్గెట్ చేసినట్లుగా పవన్ మరో వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేయలేదు. మామూలుగా ప్రభుత్వ పరంగా విమర్శలు చేస్తారు. అలాగే సి‌ఎం జగన్‌ని టార్గెట్ చేస్తారు..ఇంకా తనని తిట్టే కొందరు మంత్రులు, మాజీ మంత్రులపైనా పవన్ విరుచుకుపడతారు.

కానీ ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పెద్దగా ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అయితే వారాహి యాత్రలో భాగంగా కాకినాడకు వచ్చిన పవన్..అక్కడ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  “ ద్వారంపూడి నువ్వో డెకాయిట్‌.. కాకినాడను నువ్వు డ్రగ్స్‌ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. నీ నేర సామ్రాజ్యం నేలకూలుస్తా. నీకు రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ఈ నాలుగేళ్లలో ద్వారంపూడి కుటుంబం అక్రమ సంపాదన రూ.15వేల కోట్లని ఆరోపించారు. ఎక్కడైనా స్థలం కనిపిస్తే చాలు కబ్జాలకు పాల్పడుతున్నారని, అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని,  గంజాయి సరఫరా, బియ్యం వ్యాపారంతో సంపాదించిన అక్రమార్జనతో బలిసి ఉన్నాడని ఫైర్ అయ్యారు. జనసేన అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తాతను బేడీలు వేసి జైలుకి పంపించిన అప్పటి ఎస్పీ డీటీ నాయక్‌లా తాను బీమ్లా నాయక్‌ ట్రీట్మెంట్‌ చూపిస్తానని అన్నారు.

ఇలా ద్వారంపూడిని పవన్ టార్గెట్ చేయడానికి కారణాలు ఉన్నాయి. గతంలో ద్వారంపూడి..పవన్‌ని అకారణంగా పచ్చి బూతులు తిట్టారు. వ్యక్తిగతంగా తిట్టారు. పవన్‌ని తిట్టారని చెప్పి జనసేన శ్రేణులు ద్వారంపూడి ఇంటి వద్ద నిరసన తెలియజేస్తే..వారిపై ద్వారంపూడి అనుచరులు దాడి చేశారు. అందుకే ఇప్పుడు ద్వారంపూడిని పవన్ టార్గెట్ చేశారు. ఇక ఆయన్ని ఓడిస్తానని పవన్ అంటున్నారు. కాకపోతే సింగిల్ గా ద్వారంపూడిని ఓడించడం పవన్ వల్ల కాదు.

కాకినాడ సిటీలో జనసేన కంటే టి‌డి‌పి బలంగా ఉంది. టి‌డి‌పి-జనసేన కలిస్తేనే ద్వారంపూడికి చెక్ పడుతుంది. గత ఎన్నికల్లో ద్వారంపూడికి 73 వేల ఓట్లు వస్తే, టి‌డి‌పికి 60 వేలు,జనసేనకు 30 వేలు ఓట్లు వచ్చాయి. అంటే టి‌డి‌పి, జనసేన కలిస్తే ద్వారంపూడికి చెక్ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news