బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్… కాశ్మీరి కవిత చదివిన నిర్మల…!

-

2020-21 బడ్జెట్ ని నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నిర్మల దేశ ఆర్ధిక సంస్కరణలకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రజల ఆదాయం పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు. ఆర్ధిక రంగ మూలాలు బలంగా ఉన్నాయన్నాయన్నారు. ద్రవ్యోల్భణం అదుపు చేసామన్నారు. ఇది సామాన్యుల బడ్జెట్ అన్నారు. అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతం ఇచ్చెలా బడ్జెట్ ఉంటుంది అన్నారు. పాలనా రంగంలో పూర్తి స్థాయి మార్పులు తెచ్చామన్నారు.

సంస్కరణలు వేగవంతం చేసామన్నారు. రాజకీయ స్థిరత్వంతో పాటు ఆర్ధిక పురోగతికి ఊతం ఇచ్చామన్నారు. ఆర్ధిక సంస్కరణలో జీఎస్టీ కీలకమైంది అన్నారు. gst తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభపడ్డాయి. అలాగే ప్రజల ఆదాయం 5 శాతం ఆదా అయిందని చెప్పారు. ఇన్స్పెక్టర్ రాజ్ కి చరమ గీతం పాడామని చెప్పిన ఆమె దీని వలన చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు లాభం చేకూరింది అన్నారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్ దాఖలు చేసారన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా ప్రజలకు పథకాలు వేగంగా చేరుతున్నాయన్నారు.

అన్ని రంగాల్లో వృద్ది రేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుందన్నారు. కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు చేరారన్నారు. ఏప్రిల్ నుంచి మరింత సులభంగా పన్ను చెల్లింపులు చేశామన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రతీ పౌరుడుకి చేరేలా చూస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. జనం ఇప్పుడు బాగా బ్రతుకుతున్నారన్నారు. కాశ్మీరీ పండిట్ దీనానాద్ కౌల్ కవితను నిర్మల చదివారు. నీటి ఎద్దడి ఉన్న 100 జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి అని చెప్పుకొచ్చారు.

మన దేశం దాల్ సరస్సుల్లో కమలం బాగా వికసిస్తుంది. వ్యవసాయాభివృద్దికి 16 సూత్రాల కార్యక్రమం ప్రవేశపెడతామని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. అందరి ఆర్దికాభివ్రుద్దె తమ లక్ష్యమని అన్నారు. సోలార్ పంప్స్ తో 20 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది అన్నారు. ఆయుష్మాన్ భావ అద్భుత ఫలితాలు ఇచ్చింది అన్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి సంబంధించి 3 కొత్త చట్టాలు తీసుకోస్తామన్నారు.

రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయన్నారు. ప్రపంచంలో మనది 5 వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అన్నారు. మన మౌలిక ఆర్ధిక పునాదులు పటిష్టం అన్నారు. జీడీపీలో ఇప్పుడు 48. 7 శాతానికి అప్పులు తగ్గాయని ఆమె అన్నారు. “నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం సైనికుడి రక్తంలో ప్రవహిస్తున్న మరిగే రక్తం లాంటిది.” అంటూ కాశ్మీరి కవిత వినిపించారు. బీడు భూముల్లో సోలార్ పంప్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news