మిడిల్‌ క్లాస్‌కు మోడీ బహుమతి…!

-

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ని తీసుకురానున్నారు. మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించచ్చని తెలుస్తోంది. మరి ఇప్పటి దాకా వచ్చిన సమాచారం ప్రకారం వీటిల్లో మార్పులు వుండచ్చనీ.. మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించచ్చని అర్ధం అవుతోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. 2014 తర్వాత ఆదాయ పన్ను మినహాయింపును కేంద్రం పెంచలేదు.

2019 నుంచి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000 గానే వున్నా విషయం తెలిసిందే. అయితే కేంద్రం స్టాండర్డ్‌ డిడక్షన్‌, మినహాయింపులను పెంచే ఛాన్స్ వుంది. పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి వేతన ఆధారిత మధ్య తరగతికి రిలీఫ్ కలగచ్చట. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని రోజుల ముందు ఈ విధంగా అన్నారు. దీనితో మధ్య తరగతి వాళ్ళ సమస్యలు గట్టెక్కచ్చు అని అంతా భావిస్తున్నారు.

‘నేనూ మధ్య తరగతి మహిళనే. వాళ్ళ యొక్క కష్టాలను నేను అర్థం చేసుకోగలను. నన్ను నేను మధ్య తరగతి మహిళగానే గుర్తించుకుంటాను. అందుకే నాకు తెలుసునని’ నిర్మలా సీతారామన్‌ అన్నారు. అయితే మన దేశం లో మధ్య తరగతి వారు ఎక్కువ పెరుగుతుండడం మూలంగా 27 నగరాల్లో మెట్రో రైలు విస్తరించామని అన్నారు. వంద స్మార్ట్‌ సిటీలు నిర్మిస్తున్నామని కూడ అన్నారు. ఆమె అన్న దాని బట్టీ సెక్షన్‌ 80సీ పరిధి పెంచడం అలానే మినహాయింపులు పెంచడం ఇటువంటివి కొన్ని తొలగించేసి కొత్త సెక్షన్లు సృష్టించడం చేస్తుందని కూడ అంతా అంటున్నారు.

మూలధన రాబడి పన్ను నిబంధనలను మధ్య తరగతి వాళ్లకి అనుకూలంగా మార్చేలా కనపడుతున్నారు. అలానే ఈ మధ్యన ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. అలానే వైద్య బీమా ప్రీమియం చెల్లింపులను కూడ ఈజీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాక జీవిత బీమా మినహాయింపు కోసం స్పెషల్ ప్రావిజన్లు ఏర్పాటు చెయ్యచ్చని అంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news