పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తలు ఎంత సరదాగా ఉంటారు.. ఎంత సేపు మాట్లాడాలని, ఒకరిని విడిచి మరొకరు అస్సలు ఉండలేరు.. అయితే పిల్లలు పుట్టాక మాత్రం ఆ బంధం గాల్లో దీపం పెట్టినట్లే.. ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూస్తారు.. ఇద్దరు కలిసి టైమ్ స్పెండ్ చేయకపోవడంతో ఇంట్రెస్ట్ తగ్గి ఇద్దరి రిలేషన్ దెబ్బతింటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ తప్పులను అస్సలు చెయ్యకండి.. అవేంటంటే..
- డబ్బు విషయంలో జాగ్రత్తలు ఉండదు.. పిల్లల పుట్టకముందు ఇష్టమైన విధంగా డబ్బు ఖర్చు చేసి ఉండొచ్చు. కానీ, పిల్లలు పుట్టాక అనవసరం డబ్బు ఖర్చు చేయొద్దు. పిల్లల పోషణకి, ఫ్యూచర్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం గొడవలు పూర్తిగా సర్దు మణుగుతాయి…
- మీరు పెరిగిన వాతావరణం వేరేలా ఉండొచ్చు.. కానీ పిల్లలకు మాత్రం మంచి బుద్దులు నేర్పించాలి.. ఇద్దరు కలిసి పెంచడం మీ ఇద్దరి బాధ్యత.. మొండిపట్టు వద్దు.. ఇద్దరు కలిసి అన్నింటిని వదిలి నిర్ణయాలు తీసుకోవడం మంచిది…
- కొందరు జంటలు పిల్లలు పుట్టగానే శృంగారమనే విషయాన్నే పట్టించుకోరు. దానికి టైమ్ ఉండదు. కానీ, అలా చేయొద్దు.. పిల్లలు ఉన్నా కాసేపు మీ పార్టనర్‌తో ఆనందంగా గడపండి.. ఆ నిమిషాలే మీకు ఆనందాన్ని ఇస్తాయి.. గొడవలు రాకుండా చూసుకుంటుంది…
- పిల్లలు పుట్టకముందు వేరు, పుట్టాక వేరు. తను పిల్లల పెంపకం విషయంలో కొన్ని బాధ్యతలను విస్మరిస్తే వారి పెంపకాన్ని తప్పు పట్టొద్దు. మీరు ఇద్దరు కలిసి పిల్లలను ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దంపతులు ముందుకు సాగాలి అప్పుడే దాంపత్య జీవితం సాఫిగా సాగుతుంది..