భవిష్యత్తు బాగుండడానికి మధ్యతరగతి ప్రజలు తెలుసుకోవాల్సిన ఆర్థిక పాఠాలు..

మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మధ్యతరగతి మనస్తత్వం విభిన్నంగా ఉంటుంది. అటు డబ్బున్నవారిలా ఉండలేరు. ఇటు ఏమీ లేనివారిలానూ ఉండలేరు. అలా బ్రతకలేక, ఇలా ఉండలేక కాలం వెళ్ళదీస్తుంటారు. ఐతే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని ఆర్థిక పాఠాలని తెలుసుకుందాం.

ఈఎమ్ ఐ

ఈఎమ్ ఐ ఎప్పుడూ భారం కాకూడదు. ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు ఈఎమ్ ఐ ఆప్షన్ గుర్తుకు రావడం సహజమే. కానీ, అది ప్రతీ నెల భారమయ్యి, కట్టలేని పరిస్థితికి తీసుకురావద్దు. నెల నెల మీ నెత్తిమీద ఏదో బరువు ఉన్నట్లు ఫీల్ అవుతున్నారంటే అది అనవసరంగా కడుతున్నట్లే లెక్క.

కార్

మీ ఫ్రెండ్స్ కారు కొనుక్కున్నారని చెప్పి మీరు కొనవద్దు. మీ దగ్గర డబ్బులుండి దాన్ని మెయింటైన్ చేయగలను అనుకున్నప్పుడే కొనండి. అర్థం లేని ఆడంబరాలకు పోయి భారం మీదకి తెచ్చుకోవద్దు.

మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బును మీ పిల్లల విద్యపై ఖర్చు చేయవద్దు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా మంచి స్కూల్ అని చెప్పి లక్షలు పోసి చదివించవద్దు. దానికి బదులు వారి ఇంట్రెస్ట్ తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేయండి.

బ్యాంకు ఫిక్స్ డిపాజిట్స్ లో పెద్దగా రిటర్న్స్ లేవు కాబట్టి, దానికన్నా మెరుగైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం తెలుసుకోండి. ఇంతకుముందు వచ్చిన రిటర్న్స్ ఇప్పుడు బ్యాంకు ద్వారా రావట్లేదు.

టర్మ్ ఇన్స్యూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. మీ మీద ఆధారపడ్డ వారికి అది తోడుగా ఉంటుంది.

అవసరంలో ఉన్నవారికి ఆర్థికంగా సహాయం చేయండి. మీకు చేతనైనంత వరకే. అతిగా పోయి మీ దగ్గర లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సహాయాలు చేయవద్దు.

డబ్బుని సృష్టించే ఆదాయ మార్గాలు కనిపెట్టండి. దానికోసం కొంత సమయాన్ని ఖర్చు చేయండి.