ఒకరితో కన్నా ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోవడం ఎప్పటికైనా నాశనానికే దారితీస్తుంది. ఇక్కడ సంబంధం అంటే కేవలం ఫిజికల్ గా మాత్రమే కాదు.. మానసికంగా సంబంధం పెట్టుకున్నా కూడా నాశనం తప్పదు.
అయితే మీ జీవిత భాగస్వామి ఎమోషనల్ గా ఎఫైర్ పెట్టుకున్నారని తెలియాలంటే కొన్ని సంకేతాలను పసిగట్టాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీ భాగస్వామి రోజువారి షెడ్యూల్ లో మార్పులు:
మీకు వివరణ ఇవ్వకుండా మీ భాగస్వామి రోజువారి షెడ్యూల్లో మార్పులు కనిపిస్తుంటే.. వేరే వాళ్ళతో ఎమోషనల్ గా బంధం పెంచుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.
మీతో ఏదీ పంచుకోకపోవడం:
పొద్దున్న లేచావా, ఆఫీస్ కి వెళ్ళామా తిరిగి వచ్చామా అన్నట్టుగా ఉంటూ మీతో ఎలాంటి విషయాన్ని షేర్ చేసుకోకుండా ఉంటే.. మీరు మీ భాగస్వామి పై అనుమానపడవచ్చు. పరిస్థితులన్నీ సరిగ్గా ఉన్నప్పుడు కూడా మీతో ఏది పంచుకోకపోతే.. అవతల వాళ్ళతో పంచుకుంటున్నారని అర్థం.
అతిగా సమయం గడపడం:
మీతో మాటలు తగ్గించేసి వేరే ఎవరితోనో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారంటే.. ఎమోషనల్ ఎఫైర్ కొనసాగిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇది ఎఫైర్ అని, అలా చేయడం కూడా కరెక్ట్ కాదని వాళ్లకు తెలియకపోవచ్చు.
ఓవర్ ప్రొటెక్షన్:
మీ భాగస్వామి ఎవరి పట్లనైనా కావలసిన దానికన్నా ఎక్కువ కేర్ చూపిస్తుంటే.. వాళ్ల మీద ఎమోషనల్ గా డిపెండ్ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
చాటింగ్:
ఇంట్లో ఉన్న ప్రతీసారి చేతుల్లో మొబైల్ పట్టుకుని చాటింగ్ చేస్తూ కూర్చున్నట్లయితే.. మీతో మాట్లాడటం కన్నా అవతలి వాళ్ళతో మెసేజ్ చేయడమే వాళ్లకు ఆనందంగా అనిపిస్తుందని అర్థం. ఎమోషనల్ అఫైర్ కి ఇది ముఖ్యమైన సంకేతం.
ఇలాంటి సంకేతాలు ఉన్నంత మాత్రాన ఎమోషనల్ ఎఫైర్ ఖచ్చితంగా ఉందని కాదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ భాగస్వామితో ఒకసారి మాట్లాడండి.