ఆ మంత్రితో సహా సీఎం రేవంత్ రెడ్డి వరకు అందరి బండారం బయటపెడతాం : మంత్రి జగదీశ్ రెడ్డి

-

రాష్ట్రంలో రైతులకు సాగునీరు, మద్దతు ధర లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దళారుల చేతుల్లో రైతులు దోపిడీ గురికావడానికి కారణం మంత్రులే అని ఆరోపించారు. సోమవారం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి సహా సీఎం రేవంత్ రెడ్డి వరకు అందరి బండారం బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. రైతులపై ప్రభుత్వ కుట్రను త్వరలో బయటపెడతామని షాకింగ్ ప్రకటన చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజాక్షేత్రంలో నిలదీస్తుంటే.. బాంబులు వేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో పరిస్థితులన్నీ తారు మారు
అయ్యాయని విమర్శించారు. అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వ శాఖలు పడకేశాయని విమర్శించారు.
తెలంగాణ లో పోలీస్ శాఖ ఒక్కటే ప్రశ్నించే గొంతులను అణిచి వేసేందుకు పని చేస్తుందన్నారు. స్కూళ్ల లో పిల్లలు చనిపోతున్నారని, దవాఖానల్లో మందులు అందుబాటులో లేక డాక్టర్లు బయట నుంచి తెచ్చి వైద్యం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news