నమ్మకాన్ని పొందడం ఎంతో కష్టం.. అందుకే బ్రేక్ చెయ్యద్దు..!

ఎప్పుడైనా మనం ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకోవాలన్నా వాళ్ళు చెప్పేది మనం వినాలన్న వెంటనే అది జరగని పని. కచ్చితంగా వాళ్ళు చెప్పే దాని కోసం ఆలోచిస్తూ ఉంటాము. ఎవరు పడితే వాళ్ళు చెప్తే మనం వినుము. వినకూడదు కూడా. అయితే ఒకరు చెప్పేది మనం వినాలి అంటే కచ్చితంగా వాళ్ల గురించి మనం తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే నమ్ముతాము. అలానే ఆచరించాలి.

 

కొన్ని కొన్ని సార్లు కొంత మంది వ్యక్తుల పై నమ్మకం ఉన్నా సరే ఏదైనా విషయాలు చెప్తే ఆలోచిస్తాము. అంత త్వరగా నమ్మము. అయితే ఎవరైనా చెప్పిందే నమ్మాలంటే ఖచ్చితంగా వాళ్లకి అవతల వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియలేదంటే నమ్మరు. ఎదుటి వ్యక్తి చెప్పింది నమ్మకపోవడానికి వెనక రెండు కారణాలు ఉంటాయి. ఒకటి బాగా తెలియడం. మరొకటి అసలు తెలియకపోవడం.

ఒక్కోసారి మనకి బాగా తెలిసిన వ్యక్తులు చెప్పినా ఆలోచిస్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ల గురించి మనకు అన్నీ తెలుసు కాబట్టి. అదేవిధంగా ఎవరైనా తెలియని వ్యక్తులు చెబితే నమ్మము. ఎందుకంటే వాళ్ళ పై నమ్మకం ఇంకా పెట్టుకోలేదు కనుక. అయితే నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు బ్రేక్ చేయకూడదు ఒకసారి నమ్మకం పోయింది అంటే మళ్లీ దాన్ని సంపాదించడం చాలా కష్టం.

ఎదుటి వాళ్ళ జీవితంలో మనం కాస్త ట్రావెల్ చేస్తే అప్పుడు మనం వాళ్ళ గురించి తెలుసుకుంటాము అలానే నమ్మకం పెట్టుకుంటాం. పైగా ఎప్పుడైనా సరే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ”నమ్మకం కాగితం లాంటిది చిరిగిన, అతికినా గతుకులు గానే ఉంటుంది” గుర్తు పెట్టుకోండి.